TS Mirchi స్పెషల్ : రాష్ట్రీయం-జాతీయం-అంతర్జాతీయం
రాష్ట్రీయం :
1. ఉర్దూని రెండో అధికార భాషగా గుర్తిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ఎన్ని రోజుల్లో అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఉంది ?
A : 60 రోజులు
2. లివింగ్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ పురస్కారం చేపట్టిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు ఎవరు ?
A : నోరి దత్తాత్రేయుడు
3. హైదరాబాద్ గీతం యూనివర్సిటీ ఏ ప్రముఖుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది ?
A : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జాతీయం :
4. ‘జర్నీఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరు ?
A : నూపుర్ కుమార్
5. 23వ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?
A : అసోం (గువహటీ)
6. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సేవలు ఇకపై ఏ యాప్ లో అందుబాటులో ఉంటాయి ?
A : ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్)
7. విజయవాడ విలు విద్యా క్రీడాకారిణి (ఆర్చర్) చెరుకూరి డాలి శివానీకి ఏ అవార్డు దక్కింది ?
A : వరల్డ్ కింగ్ గోల్డెన్ డిస్క్ అవార్డు 2018
8. చైల్డ్ రైట్స్ వీక్ హౌస్లా 2017 నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ?
A : మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్
9. హెపటైటిస్-సి వ్యాధిగ్రస్తులకు ఓరల్ మెడిసన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న మొదటి రాష్ట్రం ఏది ?
A : హర్యానా
10. ఎకనామిక్ అడ్వయిజరీ కౌన్సిల్ (EAC-PM) రెండో సమావేశం ఎక్కడ జరుగుతుంది ?
A : న్యూఢిల్లీ
11. భారత్’లో వ్యాపారులు, వినియోగదారుల డిజిటల్ పేమెంట్స్ కోసం కొత్తగా కార్యకలాపాలను ప్రారంభిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది ?
A : పే పాల్
12. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోమ్ లోన్ కోసం ఎన్ని లక్షల వరకూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
A : 25 లక్షలు
13. ఢిల్లీలో పొగమంచు కాలుష్యం పెరిగిపోవడంపై అధ్యయనం చేసిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర సర్కార్ ఎవరి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ?
A : సీకే మిశ్రా
14. దేశంలోని మొదటి కార్టూన్ నెట్ వర్క్ థీమ్ పార్క్ అమాజియా ను ఏ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు ?
A : సూరత్ (గుజరాత్ )
15. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A: తెలంగాణ
16. 2017 నేషనల్ ఎంట్రిపెన్యూర్షిప్ అవార్డ్స్ కింద ఎంత ప్రైజ్ మొత్తాన్ని నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ ఇవ్వాలని నిర్ణయించింది ?
A : 15లక్షలు
17. దుబాయ్’లో క్రికెట్ అకాడమీని స్థాపించిన భారతీయ క్రికెటర్ ఎవరు ?
A : ఎం.ఎస్.ధోనీ
అంతర్జాతీయం :
18. ఆసియాన్ 5 వ వార్షికోత్సవం ఎక్కడ జరుగుతోంది ?
జ : ఫిలిప్పీన్స్ లో
19. అవినీతి ఆరోపణలు, అక్రమ నగదు చలామణి ఆరోపణలతో రాజీనామా చేసిన బంగ్లాదేశ్ మొది హిందూ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ : జస్టిస్ సురేంద్ర కుమార్ సిన్హా
20. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 23 పార్టీలతో కలసి ఏ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు ?
జ : పాకిస్థాన్ అవామీ ఇత్తెహాడ్ (పీఏఐ)
21. వినియోగదారుల పేరు పెట్టుకోడానికి ట్విట్టర్ 20 అక్షరాల నుంచి ఎంతకు పొడిగించుకోవచ్చు ?
జ : 50 అక్షరాలు
22. 40యేళ్ళు పూర్తి చేసుకున్న మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ ( MRI) ను ఎవరు కనుగొన్నారు ?
జ : అమెరికా శాస్త్రవేత్త రేమండ్ డయాడియన్ ( 1977లో)
23. సామాజిక న్యాయంలో 2017 మదర్ థెరిసా మెమోరియల్ అవార్డ్ అందుకు అంతర్జాతీయ సంస్థ ఏది ?
జ : United Nations High Commisioner for Refugees (UNHCR)
24. ఇటీవల చనిపోయిన కీర్తి నిధి బిస్తా ఏ దేశ మాజీ ప్రధాని ?
జ : నేపాల్
25. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ గా మళ్లీ ఎన్నికైన సభ్య దేశం ఏది ?
జ : భారత్
26. మొదటి అంతర్జాతీయ ఆయుష్ సదస్సు, ఎగ్జిబిషన్ ఎక్కడ జరగనుంది ?
జ : దుబాయ్
27. ఏ దేశంతో కలసి విపత్తు నిర్వహణ చర్యల్లో పాల్గొనందుకు ఫేస్ బుక్ సంస్థ భాగస్వామ్యం అవుతోంది ?
జ : భారత్ తో