ఇటలీలో ‘విరుష్క పెళ్లి ప్లాన్’ వెనక.. !
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఇంతకీ విరుష్క పెళ్లి ఇటలీలో ప్లాన్ చేయాలన్న ప్లాన్ ఎవరిచ్చారో తెలుసా ? ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత నటి రాణీముఖర్జీ భర్త ఆదిత్యచోప్రా ఇచ్చిన సలహా ఇది.
ఆదిత్యచోప్రా దర్శకత్వం వహించిన “రబ్ నే బనాది జోడీ” చిత్రంతోనే అనుష్క బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ‘యశ్‌రాజ్ ఫిలింస్’తో అనుష్క మూడు సినిమాలకు సంతకం చేసింది. ఆ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఆదిత్యను మెంటర్‌గా భావించే అనుష్క ఆయన సలహా ప్రకారమే విరాట్‌ను ఇటలీలోని టస్కనీలో వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారమ్.
పెళ్లి ఫోటోలు అమ్మేశారు :
విరుష్క పెళ్లి ఫోటోలు కొన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐతే, మొత్తం ఫోటోలని ఓ ఫ్యాషన్ మేగజైన్‌కు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని అనుష్క, విరాట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు తప్ప ఇతర ఫోటోలు బయటకు రానివ్వలేదని సమాచారమ్.