హైదరాబాద్’లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ సభల ద్వారా తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ మహాసభల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలకు ప్రారంభోపాన్యాసం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముగింపు ఉపన్యాసం రాష్ట్రపతి కోవింద్ ఇవ్వనున్నారు.
ప్రపంచ మహాసభలని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్’లో ట్రాఫిక్ ఆంక్షలని విధించారు. ఎల్బీస్టేడియం, రవీంద్రభారతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. దీంతో పాటు సభకు హారజయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిజాం కళాశాల మైదనాంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ ఓ ప్రకటన చేశారు.
మరోవైపు, హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ సభల ద్వారా తెలుగు, తెలంగాణ బాష గొప్పదన్నాన్ని ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం అన్నారు కడియం. ఈ సభ కోసం రేపటి నుంచి టికెట్ కిట్స్ అందజేయనున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరాఖాస్తు చేసుకొన్న వారికి ఈ కిట్స్ అందజేయనున్నారు.