చంద్రబాబుకు కేంద్రం హెచ్చరిక ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించినట్టే ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రధాన్యతని సంతరించుకొంది. ఐతే, ఈ మీటింగులో గడ్కరీ చంద్రబాబుని హెచ్చరించినట్టు సమాచారమ్. పోలవరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలకు సంబంధించి కేంద్రం దగ్గర అన్నీ ఆధారాలున్నాయని చెప్పారట.
సమావేశం అనంతరం గడ్కరీ ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా వార్నింగ్ మాదిరిగానే ఉంది. గుత్తేదారు నెలరోజుల్లో పనిలో పురోగతి చూపాలని, లేదంటే.. కొత్త టెండర్ల వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, గడ్కరీతో మీటింగు విశేషాలని చంద్రబాబు ఇంకా మీడియాతో పంచుకోలేదు. మరీ.. బాబు ఏ సన్మానం జరిగిందని చెబుతాడో చూడాలి.