అర్జున్ రెడ్డి ఫిదా అయిపోయాడు

‘అర్జున్ రెడ్డి’గా అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతిలో అరడజనుకిపైగా సినిమాలున్నాయి. ఐతే, ఈ యేడాది ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల విజయ్ దేవరకొండ కోసం ఓ కథని రెడీ చేసుకొన్నాడు. ఇటీవలే ఆ కథని విజయ్’కి వినిపించడం.. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయినట్టు సమాచారమ్.

అవసరమైతే.. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారేందుకు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్మల చెప్పిన కథ విజయ్ కి ఆ రేంజ్ లో నచ్చిందని చెబుతున్నారు. గతంలో శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో పూర్తిస్థాయి హీరోగా కనిపించబోతున్నాడు.