నాని సక్సెస్ వెనక సునీల్

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో నాటౌట్’గా కొనసాగుతున్న ఏకైక హీరో. ఆయన నుంచి మూడ్నెళ్లకో సినిమా.. యేడాదికి ముడ్నాలుగు సినిమాలు. దేనికదే డిఫరెంటు సినిమా. అన్నీ సూపర్ హిట్సే. ఇప్పుడు నానిని చూసి స్టార్ హీరోలు కుళ్ళుకునే పరిస్థితి. ఐతే, నాని ఈ స్టేజీకి అంతా ఈజీగా రాలేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ క్ ఎదిగాడు. ఈ దశలో నానిని సపోర్టు చేసిన వాళ్లు చాలామందే ఉంటారు. అందులో స్టార్ కమెడియన్ సునీల్ కూడా ఒకరు.

ఈ విషయాన్ని స్వయంగా నానినే తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సునీల్ తాజా చిత్రం ‘2కంట్రీస్’ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు నాని హాజరయ్యారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. “నాలో కాన్ఫిడెంట్‌ పెంచిన వ్యక్తి సునీల్ అన్న. నేను హీరో కాక ముందు నుంచి సునీల్‌ ఆయనతో మంచి పరిచయం ఉంది. ‘ఢీ’ సినిమాకు నన్ను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రికమండ్‌ చేశారు” అని తెలిపారు. అలాంటిది ఇప్పుడు నాని వరుస హిట్స్ తో దూసుకెళ్తుంటే.. సునీల్ ఓ హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నాడు.

ఇక, ‘2 కంట్రీస్‌’కు దర్శకుడు, నిర్మాతగా కూడా ఎన్‌. శంకర్‌ వ్యవహరించారు. సునీల్, మనీషా రాజ్‌ జంటగా నటించారు. గోపీసుందర్ సంగీతం. ఈ నెల 29న 2కంట్రీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.