విరుష్కల రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు ఇదే !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు సలైంట్’గా ఇటలీలో పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ నెల 21ఢిల్లీలో తాజ్‌ డిప్లొమాటిక్‌ ఎంక్లేవ్‌లో బంధువులకు, ఈ నెల 26న సినీ, క్రికెట్ స్టార్స్ రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక బయటికొచ్చింది. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ విరుష్కల రిసెప్షన్ ఆహ్వాన పత్రికని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రిసెప్షన్ కార్డుతో పాటు మర్చిపోలేని గిఫ్ట్ గా ఓ మొక్కను కూడా జతచేశారు. పర్యావరణానికి హాని చేయని పేపర్‌ బ్యాగులో మొక్కని పెట్టి, ఆహ్వాన పత్రికని అందిస్తున్నారు.

మరోవైపు, విరుష్కలకు పెళ్లి శుభాకాంక్షల వెల్లువ ఇంకా తగ్గడం లేదు. గురువారం విరుష్క దంప‌తుల‌కు డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ వెరైటీగా విషెస్ చెప్పింది. “కంగ్రాచ్యులేష‌న్స్‌… విరాట్‌, అనుష్క‌… మీ మ‌ధ్య‌కు దేన్ని అడ్డురానీయ‌కండి.. ఒక్క డ్యూరెక్స్ మిన‌హా” అని రాసి ఉన్న ఫొటోను కంపెనీ ట్వీట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. కంపెనీ తెలివితేట‌ల‌కు మెచ్చుకుంటున్నారు.