మేడారం ప‌నుల‌కు ఆదివాసీల ఆటంకం..!

లంబాడాలకు ఆదివాసులకు మధ్య వివాదం ముదురుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన దాడుల నేపథ్యంలో శనివారం ఆ జిల్లాలో పోటాపోటీ నిరసనలు, బంద్ కొనసాగుతోంది.

జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లా,తాడ్వాయి మండలంలోని మేడారం మహా జాతర కోసం జరుగుతున్న పనులను ఆదివాసులు అడ్డుకున్నారు. జాతరలో ఆదివాసేతరుల పెత్తనం ఉండద్దని, లంబాడాలను ఎస్టీ జాబితానుంచి తొలంగించాలని డిమాండ్ చేస్తున్నారు. మేడారం జాత‌ర స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గ‌డంపై అధికారుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఈ సారి మేడారం జాత‌ర స‌మ‌యంలో యాత్రీకుల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగే ప్ర‌మాదం ఉంది.