నిహారికతో ప్రభాస్ పెళ్లి.. ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొణిదెల వారి అల్లుడు కాబోతున్నాడా ? మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు, ఏకైక మెగా హీరోయిన్ నిహారికని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ?? అంటే ఇండస్ట్రీ నుంచి అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. కొద్దిరోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొదట కొణిదెల ఫామిలీ నుంచి ప్రభాస్’కు అమ్మాయిని చూస్తున్నారు. ప్రభాస్ మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడు అనే ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ప్రభాస్ పెళ్లాడబోయేది మెగా డాటర్ నిహారికనే అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ మేరకు సీనియర్ రెబల్ స్టార్, ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు మెగా ఫ్యామిలీతో సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఓ మంచి రోజు చూసుకొని పెళ్లిపై ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐతే, ఇప్పటి వరకు ఈ రూమర్ పై మెగా, కృష్ణంరాజు ఫ్యామిలీ స్పందించలేదు.
ఇక, బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్’గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాహుబలి సమయంలో స్టార్ హీరోయిన్ (స్వీటీ) అనుష్క శెట్టితో ప్రేమలో పడినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అనుష్క ఖండించింది. ప్రభాస్ నా ప్రాణ స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఐనా పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ సమయంలోనే ప్రభాస్-నిహారికల పెళ్లి న్యూస్ తెరపైకి వచ్చింది. మరీ.. చివరికి ప్రభాస్ ఎవరి వాడు అవుతాడన్నది వేచి చూడాలి.