ప్రపంచ తెలుగు మహాసభలకు “మా” సహకారం..
ఈ నెల 15వ తేదీన మొదలైన ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సభలకు తెలంగాణ కవులు, కళాకారులు ఎంతో మంది హాజరవుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా తన మార్కును ప్రదర్శించేందుకు సిద్దమవుతోంది.
ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఈ నెల 18 వ తేదీన జరిగే సంగీత విభావరిని మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా, ఉపాధ్యక్షులు బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీ రామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, కల్చరల్ కమిటీ చైర్మన్ కొండేటి సురేష్, ఉత్తేజ్ ఆహ్వానం అందజేశారు. సంగీత విభావరి కి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ పరిశ్రమ పూర్తిస్థాయి సహకారం ఉంటుందని వారు తెలిపారు.