తప్పు ప్రభుత్వానిది..! వేటు అధికారులపైనా..?
గతకొంతకాలంగా గిరిజనుల మధ్య నడుస్తున్న వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఘర్షనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ప్రభుత్వం తప్పు చేసి కలెక్టర్లపై వేటు వేశారని ఆయన అన్నారు. గిరిజనుల సమస్యపై సీఎం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. హైదరాబాద్ లో ఇంత పెద్ద తెలుగు మహాసభలు జరుగుతుంటే కనీసం అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.