బ‌ర్రెలు ,గొర్రెలతో బ‌తుకులు బాగుప‌డ‌తాయా..? : సీఎం కేసీఆర్ కు ద‌త్త‌న్న లేఖ‌

ఏ ప్ర‌భుత్వమైనా స‌రే తాను అనుకున్నది లేఖ‌ల ద్వారా ప్ర‌భుత్వానికి విన్నవిస్తూ వినూత్నంగా ముందుకెళుతుంటారు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు ద‌త్తాత్రేయ‌. త‌న లేఖ‌ల ప‌రంప‌ర‌కు కొనసాగింపుగా తాజాగా సీఎం కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఆయ‌న ఈ లేఖ‌లో ప్ర‌స్తావించారు. 52 శాతం బీసీ లు ఉంటే సరైన నిధులు ప్రభుత్వం కేటహించకపోవడం బాధాకరం అంటూ త‌న అభిప్రాయాన్ని లేఖ‌లో చెప్పారు.

బీసీలు సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, వారిని కేవ‌లం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 27 శాతం ఉద్యోగాల్లో,విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించినా, 12 శాతం మాత్రమే భర్తీ చేస్తున్నారని ఆయ‌న వివ‌రించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో టి ఆర్ ఎస్ ప్రభుత్వం బీసీ లకు రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయడం లేదని, ఓ బీసీ లకు ఎందుకు సరయిన రిజర్వేషన్లు కల్పించడంలేద‌ని ప్ర‌శ్నించారు. బర్రెలు,గొర్రెలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ బ్రతుకులు బాగుపడవని, బీసీ కార్పొరేషన్ కింద నిధులు ఇవ్వాలని ఆయ‌న అన్నారు. బీసీకమిషన్ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతుందని, క‌మిష‌న్ స్వ‌తంత్రంగా ప‌నిచేయ‌డంలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.