2019లో తెలంగాణలో సంకీర్ణమే…!! హాట్ టాపిక్ గా మారిన సర్వే రిపోర్ట్.. !!
తెలంగాణలో తాజాగా ఓ సర్వే ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. 2019ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటూ చేసిన ఈ సర్వే రిపోర్ట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్న ఆ రిపోర్ట్ పై అన్ని పార్టీల్లో కలవరం మొదలైంది. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారం కోల్పోతుందని, రెండో పెద్ద పార్టీగా టిఆర్ఎస్ మిగిలిపోతుందని సర్వేలో వెల్లడైంది. టిఆర్ఎస్ 49 సీట్ల దగ్గరే ఆగిపోతుందని తేల్చేసింది ఆ సర్వే. ఇక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ 52 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని, టిడిపి 2 సీట్లు, ఎంఐఎం 7, బిజెపి 8 సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. సిపిఎం 1 స్థానంలో గెలుస్తుందని ఆసర్వే చెబుతోంది.
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఈ సర్వే చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఉస్మానియా విద్యార్థులు ఈ సర్వే చేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఉస్మానియా విద్యార్థులెవరూ ఈ సర్వే చేశామని బహిరంగంగా అంగీకరించలేదు. సర్వే ఫలితాలను విడుదల చేసినట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు. అసలు ఈ సర్వే వారే చేశారా.. లేక ఇంకెవరైనా వారి పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేశారా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఈ సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..