ప‌వ‌న్ గుండెల్లో త్రివిక్రమ్ స్థానం ఇదీ..!!

అభిమానుల సాక్షిగా గుండెల్లో దాచుకున్న ప్రేమ‌ను,త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌రైన నేస్తం ఎవ‌రో చెప్పేశారు ప‌వ‌న్. అజ్ఞాత‌వాసి ఆడియో విడుద‌ల వేడుక వేదిక‌గా ప‌వ‌న్ త‌న మ‌న‌సులో మాట చెప్పేశారు. చాలా చోట్ల త్రివిక్ర‌మ్ పై త‌న‌కున్న అభిమానాన్ని చెబుతూ వ‌స్తున్నారు. అయితే ఎప్పుడూ లేనంత‌గా త్రివిక్ర‌మ్ త‌న గుండెల్లో కొలువై ఉన్న వ్య‌క్తిగా అభివ‌ర్ణించారు ప‌వ‌ర్ స్టార్. తాను ఓటమిలో ఉన్నా త‌న ద‌గ్గ‌ర ఎవ‌రూ లేని సంద‌ర్భాల్లో త‌న‌లో ఉండి త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డాడంటూ త్రివిక్ర‌మ్ గురించి ప‌దే ప‌దే ఆడియో వేడుక‌లో చెప్పారు ప‌వ‌న్..

త్రివిక్ర‌మ్ గురించి చెబుతూ చెబుతూ ఒకానొక సంద‌ర్భంలో ప‌వ‌న్ ఎమోష‌న్ కు లోన‌య్యారు.. నా ర‌క్తం పంచుకు పుట్టిన వారికంటే.. అని ఒక క్ష‌ణం ఆగి స‌ర్ధుకుని నా ర‌క్తం ప‌చుకుపుట్టిన వారికంటే ఎక్కువ‌గా త్రివిక్ర‌మ్ ను తిట్టాన‌ని, అంత చ‌నువు ఉందంటూ మాట్లాడారు. త‌న ర‌క్తం పంచుకుపుట్టిన వారికంటే ఎక్కువగా త‌న మ‌న‌సులో త్రివిక్ర‌మ్ కు స్థానం క‌ల్పించాన‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు ప‌వ‌న్. ప‌వ‌న్ మాట‌ల‌కు త్రివిక్ర‌మ్ కూడా కాస్త ఎమోష‌న్ కు లోన‌య్యారు కూడా.. !