ఎన్ఆర్ఐల తెలంగాణ జిల్లాల ప‌ర్య‌ట‌న‌…!

తెలంగాణ జిల్లాల పర్యటనకు ఎన్ఆర్ఆలు రెడీ అయ్యారు. తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి వచ్చిన 450 మంది ఎన్ఆర్ఐలు తెలంగాణ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళుతున్నారు. ఆదివారం NRI లతో ప్రగతి భవన్ లో భేటీ నిర్వహించి ప్రత్యేక విందు ఇచ్చిన సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్ రూంలు పరిశీలించి తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ పిలుపుతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలనకు ఎన్ఆర్ఐలు బయలు దేరారు. మొద‌ట‌గా బుధ‌వారం గజ్వేల్ నియోజక వర్గంలో వాటర్ గ్రిడ్, ఎడ్యుకేషనల్ హబ్, డబుల్ బెడ్ రూం పనులు ఎన్ఆర్ఐలు ప‌రిశీలిస్తారు. ఆ తర్వాత సిద్ధిపేట లో డబుల్ బెడ్ రూం, ఇతర అభివృద్ధి పనులు పరిశీలించి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

గురువారం(21-12-2017) రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ‌తారు ఎన్ఆర్ఐలు. ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌త్యేక బ‌స్íల్లో వెళుతున్నారు విదేశీ ప్ర‌తినిధుల బృందం.