2017 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు ఎంపికైంది వీరే..
కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.మొత్తం 24భాషలలో అకాడమీ అవార్డు లను ప్రకటించింది. తెలుగులో దేవి ప్రియ కు గాలి రంగు పద్య కావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డ్ దక్కింది. అనువాదం విభాగంలో వీణా వల్లభ రావుకు విరామమెరుగని పయనం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ లబించింది. పంజాబ్ భాషలోని ఖానాబదోష్ ఆత్మకధ ను వెన్న వల్లభ రావు తెలుగులో కి అనువదించారు. ఫిబ్రవరిలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రం, లక్ష రూపాయల నగదు బహుమానం ఇవ్వనున్నారు.