పార్టీ మార్పుపై వీరేందర్ గౌడ్ ఏమన్నారంటే.. !
తన తండ్రి దేవేందర్ గౌడ్ తో పాటు వీరేదర్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సైకిల్ దిగి హస్తం వైపు అడుగులు వేస్తున్నారంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వార్తలను ఆయన ఖండించారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ గౌడ్. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.