రేవంత్ విమర్శలు.. ఆ మంత్రికి ఇజ్జత్ కా సవాలే…!?
మంత్రి లక్ష్మ్యారెడ్డి పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుపెన్నడూ లేనంతగా ఆగ్రహంతో ఊగిపోతూ తిట్లదండకం అందుకున్నారు రేవంత్. లక్ష్మారెడ్డి బతుకేంటో బయటపెడతానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. తన చరిత్ర గురించి మాట్లాడే ముందు తానేంటో, తన వంశ చరిత్రేంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు ఆయన.
తన తండ్రి, తాత, ముత్తాతలు పోలీస్ పటేల్ గా చేశారని, రెండు వేల ఎకరాలున్న భూస్వాముల కుటుంబం తనదంటూ తన గురించి చెప్పుకొచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెకు వెళ్లి అడిగితే తన కుటుంబం గురించి తెలుస్తుందని అన్నారు. పార్టీ కోసం వాల్ పోస్టర్లు, పెయింటింగ్ లు వేసి కష్టపడి పైకొచ్చిన చరిత్ర తనదని, నీ లాగా కేసీఆర్ బూట్లు నాకి పైకి రాలేదని విరుచుకు పడ్డారు రేవంత్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా , కనీసమర్యాద లేకుండా మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇద్దరి గురించి చర్చ పెడితే ఎవరు నీళ్లు లేని బావిలో దూకుతారో చూద్దాం రా అంటూ ఆయన సవాల్ విసిరారు.
నీ చీకటి వ్యవహారంపై చర్చించమంటావా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రేవంత్. ఏమైనా రోజురోజుకు మంత్రి లక్ష్మారెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు.. రాజకీయ దూషనల నుంచి వ్యక్తి గత దూషనల వరకు వెళ్లింది వీరిద్దరి మధ్య వ్యవహారం. చూడాలి మరి ముందు ముందు వీరి వైరం ఎక్కడిదాకా వెళుతుందో..