నేను లొంగిపోవడానికి కారణం అదే…!!: మావోయిస్టు నేత జంపన్న
మావోయిస్టు కీలక నేత జంపన్న అలియాస్ నర్సింహారెడ్డి పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను లొంగిపోయిన కారణాలేమిటో పోలీసుల సమక్షంలో మీడీయాకు వెల్లడించారు. తాను , తన సహచరి అనిత..సుదీర్ఘకాలమైన విప్లవజీవితాన్ని వదులుకొని… సాధారణ జీవితం కొనసాగించాలని సరెండర్ అవుతన్నాము అని ఆయన చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.
తాము బయటకి రావడానికి కారణం సైద్దాంతిక సమస్యనే అని చెప్పారు జంపన్న. పీపుల్స్ వార్ తో కొనసాగిన చరిత్ర లో పార్టి లైన్ ప్రకారం ప్రజల కోసం నిజాయితీగా నిబదతతో పనిచేశామని, నాటి పీపుల్స్ వార్, ఆతర్వాత సిపిఐఎంల్ లో పనిచేయడం సైరైనదనే బావిస్తున్ననన్నారు. వ్యక్తి గత కారణాల రీత్య బయటకి వచ్చానని, నాయకత్వం నన్ను ఉండమని కోరిందని, కానీ తనకు సాధ్యంకాదనే బయటకు వచ్చానన్నారు. తనకున్న కుటుంబ పరిస్థితిల్లో విప్లవ కార్యక్రమాలు దూరంగా ఉండాలని నిర్లయించుకుంటున్నానన్నారు. తన సొంత ఊరిలోనే బతకాలనుకుంటున్నట్లు చెప్పారు జంపన్న.