కేటీఆర్, రేవంత్ ట్విట్టర్ వార్…!
మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. రీసెంట్ గా మంత్రి లక్ష్మారెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఒకరినొకరు చెప్పుకోలేని విధంగా తిట్టుకోవడం సోషల్ మీడీయాలో ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.. వీరిద్దరి మధ్య వివాదం నడుస్తుండగానే తాజాగా కేటీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు.
ఎవరో రేవంత్ మంత్రి లక్ష్మారెడ్డిని తిట్టిన వీడియోను కేటీఆర్ కు ట్వీట్ చేశారట. ఆట్వీట్ ను ఆయన రాహుల్ గాంధీకి ఫార్వర్డ్ చేశారట. పైగా ఒక కేబినెట్ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడటం ఏంటని రాహుల్ కు వివరించారట కేటీఆర్. రేవంత్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గానీ చర్యలు తీసుకోవాలని కేటీర్ ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ పై చర్యలు తీసుకున్నట్టే రేవంత్ విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారట.
కేటీఆర్ ట్వీట్ కు రేవంత్ అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. గురవింద సామెతలా కేటీఆర్ మంత్రి లక్ష్మారెడ్డి ఏమన్నారో తెలుసుకోవాలని, ఆతరువాత అతని పై చర్యలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారట. మొత్తంగా మంత్రి లక్ష్మారెడ్డి , రేవంత్ మధ్య వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి, కేటీర్ , రేవంత్ ల మధ్య ట్విట్టర్ వార్ కు దారి తీసింది..