అబ్బాయిలో రొమాంటిక్ డోస్ తగ్గిందా ?
‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ నాని థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. యావరేజ్ టాక్ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుండటంతో చిత్రబృందం ఆనందంలో ఉంది. అదే సమయంలో తమ అంచనా తప్పయిందని బాధపడుతోంది. వదిన-మరిదిల సెంటిమెంట్ నేపథ్యంలో ‘ఎం.సి.ఎ’ తెరకెక్కింది. నాని, భూమిల మద్య సీన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని భావించి ఆ సీన్స్‌కు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ క్రమంలో నాని-సాయి పల్లవి మధ్య రొమాంటిక్స్ సీన్స్ తగ్గించారు. ఎడిటింగ్’లో నాలుగైదు రొమాంటిక్స్ సీన్స్ ని లేపేశారు. ఐతే, ఇప్పుడు అబ్బాయిలో రొమాంటిక్ డోస్ తగ్గిందని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ రీ-ఎడిటింగ్ చేయబోతున్నట్టు సమాచారమ్. నాని-భూమికల మధ్య వచ్చే కొన్ని సీన్స్ కు కత్తెరపెట్టనున్నారు. అదే సమయంలో నాని-సాయి పల్లవిల మధ్య వచ్చే మరో రెండు మూడు రొమాంటిక్ సీన్స్ జతచేయనున్నారు. దీంతో.. అబ్బాయి మరింత రొమాంటిక్ గా తయారై బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తాడని చిత్రబృందం ఆశపడుతోంది. రెండో వారం నుంచి ఈ రీ-ఎడిటింగ్ చేసిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ని థియేటర్స్ లో చూడొచ్చు. ఇప్పటికే కలెక్షన్స్ లో అబ్బాయి అదరగొడుతున్నాడు. కేవలం 4రోజుల్లోనే రూ. 35కోట్లు వసూలు చేశాడు. త్వరలో రూ. 50కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తున్నాడు.