మందుకు ధ‌ర‌ల కిక్కు…! మ‌రి బీరుకు…?

తెలంగాణ‌లో మ‌ద్యానికి ధ‌ర‌ల కిక్కు ఎక్కింది. ప‌న్నెండేళ్ల‌లో ఇంత పెద్ద మొత్తంలో ధ‌ర‌లు పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఐఎంఎఫ్‌ఎల్‌ కార్టన్‌ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చీప్ లిక్క‌ర్ క్వార్ట‌ర్ కు 6 రూపాయ‌లు, లిక్క‌ర్ కు 10 నుంచి 20 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగాయి. ఇవాళ్టి నుంచే పెరిగిన ధ‌ర‌లు అమ‌లులోకి వచ్చాయి. అయితే ధ‌ర‌ల పెరుగుద‌ల బీర్ల‌కు మాత్రం వ‌ర్తించ‌ద‌ట‌.

తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ధరల పెంపు సాధ్యాసాధ్యా లపై ముగ్గురు సభ్యులతో టెండర్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే ఆ కమిటీ నివేదికిచ్చింది. కానీ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అదే నివేదిక ఆధారంగా ధరలు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.