మహేష్ లుంగీ డ్యాన్స్ అదుర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకొనే న్యూస్ ఇది. మహేష్ లుంగీ డ్యాన్స్ చేయబోతున్నాడు. ఆయన తాజా చిత్రం “భరత్ అను నేను”. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో మహేష్ లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టనున్నాడట. అది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్రంబృందం చెబుతోంది.

గతంలో మహేష్ ‘పోకిరి’ సినిమాలో ‘చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా..’ పాటలో లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ సినిమా కోసం లుంగీ కట్టి నడిచొచ్చాడు మహేష్. ఆ సీన్స్ ని ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘భరత్ అను నేను’లోనూ లుంగీ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని అలరించనున్నాడు.

ఈ సినిమాలో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ సరస కైరా అద్వానీ జతకట్టనుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ప్లాపు తర్వాత మహేష్ చేస్తోన్న చిత్రమిది. దీంతో.. ఈ సినిమాపై మహేష్ భారీ ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సినిమాని కూడా బాగా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.