ఓయూకు నో ఛాన్స్… !!

ఉస్మానియా యూనివ‌ర్శిటీలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ వేదిక మారింది. కొన్నికార‌ణాల‌రిత్యా సైన్స్ కాంగ్రెస్ ను వాయిదా వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం విన్న‌వించ‌డంతో సైన్స్ కాంగ్రెస్ వేదిక‌ను మార్చాల‌ని నిర్ణ‌యించారు. మ‌ణిపూర్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ సైన్స్ కాంగ్రెస్ కు వేదిక‌వ‌నుంది.

మార్చి 18 నుంచి 22వ‌ర‌కు మ‌ణిపూర్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్నారు. ఆ రాష్ట్ర సీఎం ,గవర్నర్ ల నుండి ఇస్కా కు లిఖిత పూర్వకంగా లెటర్స్ అందాయ‌ని అసోసియేష‌న్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 7 యూనివర్సిటీలు పోటీప‌డ‌గా ఆ అవ‌కాశం మ‌ణిపూర్ కు ద‌క్కింది.పోటీ ప‌డిన యూనివ‌ర్శిటీలో ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉండ‌టం విశేషం. ఓయూ కు మరో ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థనను అసోసియేష‌న్ తిర‌స్క‌రించింది.