ఆ హీరోయిన్’కు ప్రభాస్ పడిపోయాడు

స్వీటీ అనుష్కకు ప్రభాస్ పడిపోయాడన్నది టాలీవుడ్ టాక్. బాహుబలి సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐతే, అదేమీ లేదు. మేం మంచి స్నేహితులం అనేశారు ప్రభాస్-అనుష్కలు. ఇదంతా జరుగుతుండగానే ఒకరిపుట్టినరోజున మరొకరు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకొన్నట్టు చెబుతుంటారు.

స్వీటీ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే ప్రభాస్ మరో హీరోయిన్’కు పడిపోయినట్టు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహో’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది. షూటింగ్ సమయంలో హీరోయిన్ శ్రద్దా కపూర్ కు ప్రభాస్ పడిపోయినట్టు తెలుస్తోంది.

“ఆమె డెడికేషన్, హార్డ్‌ వర్కింగ్‌ నేచర్‌ కచ్చితంగా అభినందనీయం. ఈ సినిమాలో శ్రద్ధాను కేవలం పాటల్లో కనిపించటం కోసం, డాన్స్‌ సీక్వెన్స్‌ కోసం తీసుకోలేదు. తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంది. శ్రద్ధా స్వయంగా కొన్ని స్టంట్స్‌ కూడా ఫెర్ఫామ్‌ చేయబోతున్నారు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ లాస్‌ ఏంజిల్స్‌లో హాలిడేలో ఉన్న ప్రభాస్‌ ఉన్నారు. జనవరిలో హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.

‘సాహో’ తర్వాత ప్రభాస్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, ‘జిల్’ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఐతే, ఇప్పుడు ప్రభాస్ నుంచి ఆయన అభిమానులు సినిమాలు కోరుకోవడం లేదు. ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఆశపడుతున్నారు. అదెప్పుడు ? ఎవరితో ?? అనేది చెబితే పండగ చేసుకొనేందుకు ఎదురు చూస్తున్నారు డ్లార్లింగ్ ఫ్యాన్స్.