సమంత ఓ.. ప్రేమదేవత !

పెళ్లి తర్వాత సమంత ‘రతీదేవి’గా మారిందని చెప్పుకొంటున్నారు. మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్యావతి రతీదేవి. ఆమెనే ప్రేమదేవత అని పిలుస్తుంటారు. అలాంటి రతిదేవికి మన్మథుడికి ఎప్పుడు ? ఎలా వివాహం అయ్యింది ?? అనే విషయాన్ని కామ వివాహం అనే శివపురాణం తెలుపుతోంది.

ఇంతకు ఇప్పుడు హీరోయిన్ సమంతని ఎందుకు రతీదేవిగా పిలుస్తున్నారు ? అంటే.. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘మహానటి’, ‘రంగ‌స్థ‌లం 1985’ చిత్రాల‌లో న‌టిస్తున్న‌ది. ఇక, త‌మిళంలో ‘ఇరుంబుదురై’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సమంత డాక్టర్ రతీదేవిగా కనిపించబోతుందట. తాజాగా, ఆమె ఫస్ట్ లుని విడుదల చేశారు.

ఇది తెలిసిన కొందరు పెళ్లి తర్వాత సమంత రతీదేవి (ప్రేమదేవత)గా మారిందని.. భర్త నాగ చైతన్యని ఆ ప్రేమలో ముంచేస్తుందని సరదాగా చెప్పుకొంటున్నారు. ఈ గుస గుసలకి సరే.. సినిమాలోనూ పేరుకు తగ్గట్టుగా డాక్టర్ రతీదేవి రొమాంటిక్ గా కనిపిస్తుందేమోనని ఆశపడుతున్నారు. అది తెలియాలంటే వచ్చే యేడాది జనవరి 26 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ‘ఇరుంబుదురై’ ఆరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది.