హైకోర్టు విభ‌జ‌న‌పై స్పీడ్ పెంచిన‌ టీఆర్ఎస్… !

హైకోర్టు విభ‌జ‌నపై టీర్ఎస్ ప్ర‌భుత్వం స్పీడ్ పెంచింది. ఆ దిశ‌గా పోరాడాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌కు ఆపార్టీ దిశానిర్దేశం చేసింది. పార్ల‌మెంట్’లో తమ వాయిస్ గ‌ట్టిగా వినిపించేలా సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఎంపీలు. లోక్’సభ‌లో చ‌ర్చ జ‌రిగేలా చూసేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.

లోక్ సభలో హైకోర్టు విభజన‌పై వాయిదా తీర్మానం ఇవ్వనున్న‌ట్లు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడి మూడున్నర ఏళ్ళవుతున్నా హైకోర్టు విభజన జరగలేదని, ఎన్నిసార్లు పార్లమెంటులో పోరాడినా హైకోర్టు విభజన‌ జరగలేదని ఆయ‌న అన్నారు.

హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల న్యాయవాదులకు నష్టం జరుగుతుందని, ఉద్యోగాలు,పదోన్నతులు రావడం లేదని, చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయ‌న తెలిపారు. పార్లమెంటులో కేంద్ర హామీలిస్తూ హైకోర్టును విభజించటం‌ లేదన్నారు. అన్ని సదుపాయాలు ‌కల్పిస్తామని ముఖ్యమంత్రి కేంద్రానికి చెప్పినా‌ కేంద్రం హైకోర్టు విభజన చేయడం లేదని చెప్పారు.