కేటీఆర్ ఎక్కువ ఇష్ట‌ప‌డే నాయ‌కుడు ఆయ‌నే..!

మంత్రి కెటి రామారావు గురువారం ట్విట్టర్లో ప్రజలతో సంభాషించారు. #askktr హాష్ ట్యాగుతో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయాలు, మంత్రి వ్యక్తిగత అభిరుచులు, ఇతర అంశాలపైన నెటిజన్లు మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి నెటిజన్లు అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతూ త‌న ఇష్ట‌మైన రాజ‌కీయ నాయ‌కుడెవ‌రో చెప్పారు.

రాహుల్ ద్రావిడ్, కోహ్లీ, రోహిత్ లు తన అభిమాన క్రికెటర్ల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. . షారుఖ్ ఖాన్ తమ అభిమాన బాలీవుడ్ నటుడని, ముఖ్యమంత్రి కెసియార్ కాకుండా బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడున్నారు. ఇండియన్ చైనీస్ తనకు ఇష్టమైన అహారం అని, అమెరికాలో ఉన్న‌ప్పుడు తాను వంట చేసేవాడిన‌ని చెప్పారు మంత్రి కేటీఆర్.