ఆ విషయాన్ని పీఆర్ఓలతో పంచుకున్న రాహుల్.. !!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో వార్ రూమ్ లో ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులు (పిఆర్ఓ), అసిస్టెంట్ పిఆర్ఓలతో సమావేశం జరిగింది. ఇటీవల ముగిసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో పీఆర్ఓ, అసిస్టెంట్ పీఆర్ఓ కీలక పాత్ర పోషించాయి. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం, ఎన్నికలు జరిగిన తీరును ఈ సమావేశంలో సభ్యులతో రాహుల్ గాంధీ పంచుకున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సమావేశంలో చర్చించారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేదానిపై రాహుల్ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.