ప్రధానిపైనే పంచ్ వేసిన లేడీ…!
ప్రముఖ రాజకీయ నాయకురాలు అల్కా లంబా ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ముస్లింలపై కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై వ్యంగాస్త్రాలు విసిరారు. ఏకంగా దేశ ప్రధానిపై పంచ్ విసిరారు.ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ లో బిల్ పెట్టిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అల్కా లంబా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ముస్లింలు ఒక అమ్మాయిని వదుకునేందుకు తలాక్ తలాక్ తలాక్ అంటూ చెప్పి జైలుకెందుకు వెళతారంటూ ప్రశ్నించారు. అలా కాకుండా ఏమీ చెప్పకుండా భార్యను వదిలేసి వెళితే భారతదేశానికి ప్రధాని కావచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు.