ఆన్’లైన్ లో మోస‌పోయిన వెంక‌య్య‌…!

ఎంత‌టి వారైనా స‌రే ఒకానొక స‌మ‌యంలో మోస‌పోక త‌ప్ప‌దు. అలాగే ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడుకు కూడా అలాంటి సంద‌ర్భం ఓసారి ఎదురైంద‌ట‌. శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ఆ విష‌యాన్ని పంచుకున్నారు. న‌కిలీ ప్ర‌క‌ట‌న‌ల‌పై స‌మాజ్ వాది పార్టీ ఎంపీ న‌రేష్ అగ‌ర్వాల్ లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌పై వెంక‌య్య త‌న‌కు జ‌రిగిన ప‌రిణామాన్ని వివ‌రించారు.

వెయ్యి రూపాయ‌ల‌కే బ‌రువు త‌గ్గండి అంటూ ఓ ప్ర‌క‌ట‌న చూసిన వెంక‌య్య ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ ఇచ్చార‌ట‌. మందులు వ‌చ్చిన త‌రువాత మ‌ళ్లీ ఓ మెయిల్ పంపార‌ట‌. మ‌ళ్లీ ఒక వెయ్యి రూపాయ‌లు పంపిస్తే అస‌లైన మెడిసిన్ పంపిస్తామ‌ని ఆ మెయిల్ సారాంశ‌మ‌ట‌. వెంట‌నే తాను సంబంధిత శాఖా మంత్రికి , అధికారుల‌కు ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. అలా తాను ఆన్ లైన్ లో మోస‌పోయిన సంద‌ర్భాన్ని వెంక‌య్య చెప్పుకొచ్చారు. అలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు వెంక‌య్య‌.