పాలిటిక్స్ లోకి రావ‌ద్ద‌ని నాకు బెదిరింపులు వ‌చ్చాయి..! : ర‌జినీకాంత్

త‌న రాజ‌కీయ అరంగేట్రంపై సందిగ్ధంలో ఉన్న స‌మ‌యంలో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య అనుచ‌రులు త‌న‌ను బెదిరించార‌ని ర‌జినీ చెప్పారు. రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ వారి నుంచి త‌న‌కు బెదిరింపులు వ‌చ్చాయ‌ని ర‌జినీకాంత్ తెలిపారు. తాను రాజ‌కీయాల్లోకి డ‌బ్బుకోసం, పేరు కోసం రావ‌డంలేద‌ని అవ‌న్నీ త‌న‌కు ఇప్ప‌టికే ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

దేశ ప్ర‌జ‌ల‌కోసం ఏదైనా చేయాల‌నే ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు. మొత్తం 234 స్థానాల్లో పోటీకి సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కేవ‌లం ఎమ్మెల్యే స్థానాల్లోనే కాకుండా లోక్ స‌భ స్థానాల్లోనూ పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌లు ఎప్పుడు వచ్చినా సిద్ధ‌మని చెప్పారు సూప‌ర్ స్టార్..