ఇది కూడా న్యూఇయ‌ర్ గిఫ్టేనా…? : ష‌బ్బీర్ అలీ

కొత్త సంవ‌త్స‌ర కానుక అంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లు చేసుకోవ‌డాన్ని టీకాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ త‌ప్పుబ‌ట్టారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయిపోయినా, ఎన్నికల ముందు ఇచ్చిన 121 హామీలు మ‌రిచి పోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

రాష్ట్రన్ని సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణ‌గా మారుస్తున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. విభ‌జ‌న హామీలు హైకోర్టు , బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రి ఎటుపోయింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రుణ‌మాఫీ, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు ష‌బ్బీర్ అలీ. అవినీతిలో 12 వ స్థానంలో తెలంగాణ ఉందని, గత మూడు నెలలగా ఆసరా ఫించన్లు కూడా ఇవ్వడం లేద‌ని విమ‌ర్శించారాయ‌న‌.