ఆ హ‌క్కు కేసీఆర్ కు లేదు..! : టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్

టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కేసీఆర్… .40నెలలు అయినా ఇవ్వ‌లేక‌పోయార‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ విమ‌ర్శించారు. 12శాతం రిజర్వేషన్ పై సీఎం
కెసిఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. లేక‌పోతే ముస్లింల‌ను ఓట్ల‌డిగే హ‌క్కు కేసీఆర్ కు లేద‌ని ఆయ‌న అన్నారు. ఆదివారం గాంధీభ‌వ‌న్ లో దూర‌ద‌ర్శ‌న్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సుజాత్ అలీ, క్రీడాకారులు, డాక్టర్లు, సోషల్ వర్కర్లతో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరారు.

ఓల్డ్ సిటీపై సీఎం కేసీఆర్ వివ‌క్ష చూపుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఓల్డ్ సిటీ లో ఎందుకు మెట్రో పనులు మొదలుకాలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. ముస్లింల‌కు ఎంత‌మందికి డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాల‌ని , కేసీఆర్ తుగ్ల‌క్ పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడాల‌న్నారాయ‌న‌. 2019లో అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు ఉత్త‌మ్.