ప్రధాని అవ్వాలనే కోరికపై పెదవి విప్పిన వెంకయ్య…!!
ఆదివారం ఏపీలో మీడియాతో ఉపరాష్ట్రపతి వెంకయ్య కాసేపు ముచ్చటించారు. పలు అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు. 2017 తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అని అన్నారు వెంకయ్య. అందరితో కలివిడిగా ఉండడం తన స్వభావమని, ఉప రాష్ట్రపతి ప్రోటోకాల్ ఇబ్బంది పెడుతోందన్నారు.
ఉపరాష్ట్రపతి పదవి కాకుండా ఉండి ఉంటే తరువాత ప్రధాని అయ్యే అవకాశం ఉండేది కదా అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా వెంకయ్య ఆ విషయంపై స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ప్రధాని అవ్వాలని తనకు కోరికా లేదు.. అందుకు అర్హతా లేదని జవాబు ఇచ్చారు.
అధికార-ప్రతిపక్ష పార్టీలు శత్రువులు కారని, చట్ట సభలు తాలింఖానాలు కాదని ఆయన అన్నారు. చట్ట సభల్లో నిరసన తెలపడానికి వాకౌట్ల వంటి అనేక మార్గాలున్నాయని, చట్ట సభలను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాలపై నేను కామెంట్ చేయనని, తన పరిధిలో తెలుగు రాష్ట్రాలకు.. ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు వెంకయ్య.