మంద‌కృష్ణ దీక్షపై స‌స్పెన్స్

ఈరోజు నుంచి నాలుగు రోజుల‌పాటు హైద‌రాబాద్ లో ఉప‌వాస‌దీక్ష చేస్తానంటూ మంద‌కృష్ణ‌మాదిగ ప్ర‌క‌టించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ పోరాటాన్ని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వంలోక‌డియం శ్రీ‌హ‌రి పాత్ర కూడా ఉంద‌ని ఆయ‌న ఇప్ప‌టికే విమ‌ర్శించారు. అయితే దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినా దీక్ష చేసి తీర‌తానంటూ ఆయ‌న ప్ర‌క‌టించ‌డంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌ర‌గ‌కుండా కుట్ర జ‌రుగుతోంద‌ని, ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ ఉప‌వాస దీక్ష చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తివ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఎక్క‌డ దీక్ష చేస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పోలీస్ క‌మిష‌న‌ర్ ను క‌లిసిన త‌రువాత ఏ క్ష‌న‌మైనా దీక్ష‌కు కూర్చునే అవ‌కాశం ఉంద‌ని ఎమ్మార్పీఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే దీక్ష స్థ‌లం పై గోప్య‌త పాటిస్తోంది ఎమ్మార్పీఎస్.