త్రివిక్రమ్.. ఓ కాపీ రాయుడు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని విమర్శించడమే పనిగా పెట్టుకొన్నాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవన్ పై సినిమా, రాజకీయ పరంగా తీవ్ర విమర్శలు చేశారు. ఐతే, వీటిపై పవన్ ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు మహేష్ చూపు పవన్ ప్రాణ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ పై పడింది. త్రివిక్రమ్ కాపీ రాయుడు అంటూ ట్వీట్ చేశాడు మహేష్ కత్తి.

“త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్ లో, సీక్వెన్సులో, ఏకంగా కథనో… ఇలా ఎదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఏదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు”

“ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచి కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన కర్మకొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు” అంటూ వరుస ట్విట్స్ చేశాడు.


పవన్ పై ఎన్ని ఆరోపణలు చేసిన స్పందించడం లేదు. దీంతో.. ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ టార్గెట్ చేస్తే రిప్లై వస్తుందని కత్తి మహేష్ భావిస్తున్నట్టు కనబడుతోంది. మరీ.. మహేష్ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి. అంతకంటే ముందే త్రివిక్రమ్ అభిమానులు మహేష్ కత్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ విషయం ప్రక్కన పెడితే.. ఇప్పటి వరకు త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన ప్రథముడు.. కత్తి.