అల్లు అర్జున్ ‘ఆగ్రహం’ చూపిస్తున్నాడు

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “నా పేరు సూర్య”. ‘నా ఇల్లు ఇండియా’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పుడీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ ని రిలీజ్ చేశారు. ఐతే, ‘నా పేరు సూర్య’ సీనియర్ హీరో రాజశేఖర్ ‘ఆగ్రహం’ని పోలీ వుంటుందనే ప్రచారం మొదలయ్యింది.

‘ఆగ్రహం’ సినిమాలో రాజశేఖర్ ఆర్మీ మేన్’గా కనిపిస్తారు. సెలవులపై ఇంటికి వచ్చిన హీరో.. సమాజంలో జరుగుతోన్న కొన్ని అక్రమాల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. వాటిపై తనదైన శైలిలో స్పందిస్తాడు. బన్నీ ‘నా పేరు సూర్య’లోనూ హీరో క్యారెక్టరైజేషన్ ఇలానే ఉండబోతుందని చెప్పుకొంటున్నారు. మరీ.. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే ? ఏప్రిల్ 27 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ? ఆరోజే సూర్య థియేటర్స్ లోకి రానున్నాడు.