ఇలా కూడా దేశ‌భ‌క్తిని చాటుకోవ‌చ్చ‌ని చూపిన క్రీడాకారిణి..

అర్జున అవార్డ్ గ్ర‌హీత‌, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ త‌న దేశ‌భ‌క్త‌ని చాటుకున్నారు. దేశం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతున్న సైనికుల‌కోసం ఒక మంచి ప‌ని చేసి అంద‌రికీ స్పూర్తిగా నిలిచారు. అవార్డ్ రూపంలో త‌న‌కు వ‌చ్చిన ఐదు లక్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని సైనిక సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చారు. ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ పేరిట చెక్ రాసి ప్ర‌ధాని మోదీకి అందించారామె.

సైనిక సంక్షేమం కోసం త‌న‌వంతు భాగ‌స్వామ‌ర్యం ఉండాల‌ని ఆమె అనుకుంద‌ట‌. అందుకే త‌న అవార్డు డ‌బ్బును సైనికులు ఇస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించింది. ప్ర‌మాద‌క‌ర వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో సైనికులు దేశం కోసం ప‌నిచేస్తు్న్నార‌ని, రాబోయే రోజుల్లో వ్య‌క్తిగ‌త విభాగంలో కూడా వ‌రల్డ్ ఛాంపియ‌న్ షిప్ మెడ‌ల్ సాధించాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆమె చెప్పారు.