స్వ‌చ్చ‌భార‌త్ పేరుతో క్రిస్టియ‌న్ స‌భ‌లా…!

స్వ‌చ్ఛ‌భార‌త్ పేరుతో కేంద్ర అనుమ‌తులు పొంది మ‌త‌ప‌ర‌మైన స‌భుల నిర్వ‌హిస్తున్నారంటూ బీజేపీ నేత కిష‌న్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వ‌రరావుపై ఆయన విమర్శల వ‌ర్షం కురిపించారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావుపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారాయ‌న‌.

ఈనెల 5న సికింద్రాబాద్ గ్రౌండ్ లో నిర్వ‌హిస్తున్న క్రిస్టియ‌న్ స‌భ‌ల‌పై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు. స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో కేంద్ర అనుమ‌తులు పొంది ఇక్క‌డ చేస్తున్నదేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌ప్పుడు స‌మాచారంతో స‌భ‌కు వ‌స్తున్న విదేశీయుల వీసాలు ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.