కోడిపందాల‌పై హైకోర్టు సీరియ‌స్..!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగకుండా ఆంద్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లు చూసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహసీల్దార్లు, 49 ఎస్.హెచ్.ఓ.లపై గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది కోర్టు.

కోడిపందాల విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి నివేదికను జనవరి 22 వరకు సమర్పించాలని ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణన జనవరి22 కు వాయిదా ప‌డింది.