త్వరలోనే దీపికా రన్వీర్ పెళ్లి ?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఇటీవల రహస్య వివాహం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటలీలోని టస్కనీలో అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట సలైంట్ గా వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారమ్. దీపికా పదుకునే, రణవీర్ సింగ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.
త్వరలోనే ఈ జంట వివాహబంధంతో ఒక్కటవబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేపు (జనవరి 5) దీపిక పుట్టిన రోజు. రేపటితో ఆమె 32వ ఏట అడుగుపెడుతోంది. ఈ జంట ఇప్పటికే శ్రీలంకలో వాలింది. అక్కడ పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసుకోనుంది. అటు నుంచి అటే పెళ్లి చేసుకొని వచ్చేలా ఈ జంట కనిపిస్తుందని బాలీవుడ్ జనాలు సటైర్లు వేస్తున్నారు.