ఏబీ – ‘అభిజిత్ భార్గవ’గా పవన్ !

దర్శకుడు త్రివిక్రమ్’కు ఓ అలవాటు ఉంది. తన సినిమా రిలీజ్’కు ముందే కథేంటో తనదైన స్టయిల్ లో సింపుల్ గా చెప్పేస్తాడు. గతంలో పవన్ తో చేసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాల స్టోరీ లైన్ ఏంటీ ? అనేది అభిమానులకి ముందే తెలిసిపోయింది. ఐతే, ‘అజ్ఝాతవాసి’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ మారాడు. ఈసారి కథని ఏమాత్రం లీకు కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమా ఆడియో వేడుకలోనూ అభిమానులు కథ గురించి అడిగినా.. చెప్పలేదు. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. అజ్ఝాతవాసిలో పవన్ నట విశ్వరూపం చూస్తారని చెప్పి సంతోషపెట్టాడు.

అజ్ఝాతవాసి స్టోరీ లైన్ తెలియకపోయినా.. సినిమాలో పవన్ పాత్ర అభిమానులు ఆరా తీయగా.. సినిమాలో పవన్ పేరు బయటకు తెలిసివచ్చింది. సినిమాలో పవన్ అభిజిత్ భార్గవ కనిపించబోతున్నాడు. ‘జల్సా’లో పవన్ సంజయ్ సాహూగా, అత్తారింటికి దారేది సినిమాలో గౌతమ్ నందా గా అలరించాడు పవన్. ఇప్పుడు అజ్ఝాతవాసిలో అభిజిత్ భార్గవగా కనిపించబోతున్నాడు. ‘ఏబీ .. ఎవరో నీ బేబీ’ అనే సాంగ్ ను పరిశీలిస్తే, ఏబీ .. అంటే ‘అభిజిత్ భార్గవ’ అనే విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు.