అలా చేస్తే ప్ర‌దీప్ ను అరెస్టు చేస్తాం…!

న్యూఇయ‌ర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ప్ర‌ముఖ టీవీ యాంక‌ర్ ప్ర‌దీప్ కౌన్సిలింగ్ పై అపోహ‌లు తొల‌గిపోయాయి. ప్ర‌దీప్ ఎందుకు కౌన్సిలింగ్ కు హాజ‌రుకాలేక‌పోయారో పోలీసుల‌కు వీడియో రూపంలో చెప్పేశారు. పోలీసులు కూడా ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ప్రదీప్ షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల రాలేక పోయాను అని ఓ వీడియో చూశామ‌ని, అత‌ను రెండు రోజుల్లో కౌన్సిలింగ్ కు హాజ‌ర్యే అవ‌కాశం ఉంద‌ని అడిష‌న‌ల్ డీసీపీ అమ‌ర‌కాంత్ రెడ్డి తెలిపారు.

ఒక వేళా గడువు లోపు ప్రదీప్ కౌన్సలింగ్ కి రాకపోతే కోర్ట్ లో ఛార్జ్ షీట్ వేస్తామ‌ని, కోర్ట్ అనుమతి తో వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఆ తరువాత రెండు గంటలు పాటు ప్రదీప్ తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సలింగ్ నిర్వయిస్తామ‌న్నారు. కౌన్సిలింగ్ కి హాజరయ్యే ప్రక్రియ లో వీఐపీల‌కే కాకుండా, సామాన్యులకు కూడా గడువు ఇస్తామ‌న్నారాయ.