‘అజ్ఝాతవాసి’ ప్రమోషన్స్ ప్లాన్ ఇలా..

మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ ‘అజ్ఝాతవాసి’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. ఇప్పటికి వరకు ఆడియో వేడుక తప్ప చిత్రబృందం పెద్దగా ప్రమోషన్స్ కార్యక్రమాలని కూడా నిర్వహించలేదు. రిలీజ్ కి వారం ముందు ప్రమోషన్స్ లో జోరు పెంచుదామని అనుకొన్నారు. ఐతే, ఈ సినిమాపై కాపీ మరక దానికి అడ్డంగా మారింది.

ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ కోసం ప్రత్యేక ప్లాన్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత బెంగళూర్’లో ఓ ఈవెంట్ ను చేయబోతున్నారు. దీంతో పాటు టీవీ ఛానెల్స్ కు పవన్, త్రివిక్రమ్, హీరోయిన్స్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. రిలీజ్ తర్వాత ఒకట్రెండు రోజులు టీవీ ఛానెల్స్ లో అజ్ఝాతవాసి హవా కొనసాగేలా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.