రజనీ హవా మొదలయినట్టే.. !

పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పటికే సూపర్ స్టార్ రజనీ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రజనీ సందడి మొదలవ్వనుంది. ఈ యేడాది రజనీ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో ‘2.ఓ’ ముందుగా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 14న ‘2.ఓ’ని రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘2.ఓ’ అరబిక్ భాషలో కూడా రిలీజ్ అవుతోంది. ఓ భారతీయ సినిమా అక్కడ రిలీజ్ అవుతుండటం ఇదే తొలిసారి.

ఇక, రేపటి (జనవరి 6) నుంచి రజనీ సందడి మొదవ్వనుంది. శనివారం రోబో ‘2.ఓ’ ఫస్ట్ లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత నాన్ స్టాప్ గా ‘2.ఓ’ విశేషాలు విడుదల కానున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష య్ కుమార్ విలన్ గా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసే దమ్మున్న చిత్రంగా 2.ఓ ని చూస్తున్నారు. ఇక, రజనీ నటించిన మరో చిత్రం ‘కాలా’ ఈ యేడాడి వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.