కాపీ నిజమే.. ఒప్పేసుకొన్న త్రివిక్రమ్ !
దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని “అజ్ఝాతవాసి”గా చూపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే, ఇప్పుడీ సినిమా హాలీవుడ్ సినిమా “లార్గోవించ్” రిమేక్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ‘లార్గోవించ్’ రైట్స్ సొంతం చేసుకున్న టి సిరీస్.. అజ్ఞాతవాసి చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ వ్యవహారంపై సీరియస్’గా చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్.
ఫైనల్’గా ‘అజ్ఝాతవాసి’ కథని ‘లార్గోవించ్’ సినిమా నుంచి స్పూర్తి పొంది రాసుకొన్నట్టు దర్శకుడు త్రివిక్రమ్ అంగీకరించినట్టు చెబుతున్నారు. అలాంటప్పుడు కొన్ని సీన్స్ కాపీలా కనబడటం కామన్. రిలీజ్ ముందే తన సినిమా స్టోరీ లైన్’ని అభిమానులతో పంచుకొనే త్రివిక్రమ్.. ఈ కారణంగానే ‘అజ్ఝాతవాసి’ కథని ఇప్పటి వరకు ఎక్కడ లీకు కాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉండినా.. చివరకు అజ్ఝాతావాసి సినిమా, త్రివిక్రమ్ పై కాపీ మరకపడింది.
ఈ కాపీ వ్యవహారంలో ప్రస్తుతం టీ సిరీస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్. కాపీ చేసినందుకు గానూ సినిమా గ్రాస్ లో 10శాతం ఇవ్వమని టీ సిరీస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రూ. 15కోట్లు టీ సిరీస్ వెళ్లనున్నాయి. ఐతే, అజ్ఝాతవాసి చిత్రబృందం మాత్రం రూ. 5కోట్లకు బేరం సెటిల్డ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో త్వరగా సెటిల్ద్ మెంట్ చేసుకొనే పనిలో పడినట్టు సమాచారమ్.
దర్శకుడు త్రివిక్రమ్ యువ దర్శకులకి ఆదర్శం. వాళ్ల దృష్టిలో ఆయనో శిఖరం. అలాంటి శిఖరంకు కాపీ మరక అంటడం ఆయన అభిమానులని తీవ్ర బాధిస్తుంది. కలం పదను ఉన్న త్రివిక్రమ్ కు ఇలాంటి కాపీ కథలు అవసరమా ? అంటూ మరికొందరు వాపోతున్నారు. మొత్తానికి.. త్రివిక్రమ్ పై పడిన ఈ కాపీ మరక.. ఆ ప్రతిష్టకు భంగం కలిగించేదే.