స‌ర్టిఫికెట్లేవి ల‌క్ష్మారెడ్డి గారూ….? : రేవంత్

మంత్రి ల‌క్ష్మారెడ్డి , కాంగ్రెస్ నేత రేవంత్ ల మ‌ధ్య మాట‌ల యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఆయ‌న చ‌ద‌విన‌ట్లు ఎవ‌రెవ‌రితోనో చెప్పిస్తున్నారు త‌ప్ప అస‌లు స‌ర్టిఫికెట్ల‌ను ఎందుకు చూపించ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత రేవంత్ సూటిగా ప్ర‌శ్నించారు. రీసెంట్ గా హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ఎడ్యుకేష‌న‌ల్ సంస్థ ల‌క్ష్మారెడ్డిపై వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై రేవంత్ స్పందించారు. 2014, అంత‌కుముందు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో మంత్రి ల‌క్ష్మారెడ్డి త‌న చ‌దువుపై భిన్నంగా పొందుప‌రిచార‌ని రేవంత్ అన్నారు. ఇవిగో సాక్షాలంటూ మీడియాకు ఎన్నిక‌ల అఫిడ‌విట్ కాపీల‌ను చూపించారు.

2009 ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో గుల్బ‌ర్గా యూనివ‌ర్శిటీలో చ‌దివి 1886లో ఉత్తీర్ణులైన‌ట్లు పేర్కొన్నార‌ని తెలిపారు. 2014 ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ఎడ్యుకేష‌నల్ సంస్థ నుంచి 1887లో ఉత్తీర్ణులైనట్లు తెలిపార‌ని చెప్పారు రేవంత్. అయితే గుల్బ‌ర్గా యూనివ‌ర్శిటీలో ఆయ‌న చ‌దివిన కోర్సుకు 1990లో అనుమ‌తి వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. అనుమ‌తి రాక‌ముందే ల‌క్ష్మారెడ్డి ఆ యూనివ‌ర్శిటీలో చ‌దివిన‌ట్లు ఎలా చెప్పార‌ని ప్ర‌శ్నించారు.

అస‌లు ల‌క్ష్మారెడ్డి ఎక్క‌డ చ‌దివారో ఆ తాలుకు స‌ర్టిఫికెట్లు ఎందుకు చూపించ‌ట్లేదని సూటిగా ప్ర‌శ్నించారు. ల‌క్ష్మారెడ్డి మంచి విద్యార్థి అని చెబుతున్న ప్రిన్సిపాల్ సంప‌త్ రావు స‌ర్టిఫికెట్ల‌ను ఎందుకు మీడియాకు విడుద‌ల చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మంత్రి ల‌క్ష్మారెడ్డి ,రేవంత్ ల మ‌ధ్య స‌మ‌సిపోయింద‌నుకున్న మాట‌ల యుద్ధం మ‌ళ్లీ మొద‌లైంద‌ని చెప్పుకోవ‌చ్చు.