పవన్ హీరోయిన్’ది అదే పాలసీ.. !

‘ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీ కాదు. తాను ఎవరికీ పోటీ కాదు. నాకు నేనే పోటీ’ అన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలసీ. ఇప్పుడు ఆయన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సేమ్ ఫాలసీని ఫాలో అవుతోంది. ఈ సంక్రాంతికి ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో ఒకటి పవన్ ‘అజ్ఝాతవాసి’. కాగా, రెండోది తమిళ్ స్టార్ సూర్య ‘గ్యాంగ్’. ఈ రెండు సినిమాలు రెండ్రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ విషయంపై కీర్తి సురేష్’ని అడిగితే.. తాను నటించిన అజ్ఝాతవాసి, గ్యాంగ్ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలకు పోటీ ఉంటుందని నేనకోను. నాక్కుడా ఎవరితో పోటీ లేదు. నాకు నేనే పోటీ అంటూ చెప్పుకొచ్చింది. ఇక, గ్యాంగ్ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో టేకింగ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని కితాబిచ్చింది. మొత్తానికి.. పవన్ తో కలిసి చేసిన ఒక్క సినిమాతోనే ఆయన పాలసీని ఫాలోఅవుతోంది.. కీర్తి సురేష్.