‘అజ్ఝాతవాసి’లో రాజకీయం !

‘అజ్ఝాతవాసి’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఎల్లుండే ‘అజ్ఝాతవాసి’ థియేటర్స్’లోకి రానున్నాడు. రేపటి సాయంత్రం బెనిఫిట్ షోలు పడిపోనున్నాయి. ఐతే, ఆఖరి నిమిషంలో ‘అజ్ఝాతవాసి’కి రాజకీయం కూడా తోడయ్యింది. ‘అజ్ఝాతవాసి’లో ఎమ్మెల్యే కూడా కనిపించబోతున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరంటే ? హీరో కళ్యాణ్ రామ్. ఆయన తాజా చిత్రం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా ట్రైలర్స్ ని అజ్ఝాతవాసి థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు.

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ‘ఎమ్మెల్యే’ తెరకెక్కుతోంది. కళ్యాణ్ సరసన కాజల్ జతకట్టనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎమ్మెల్యే’ ప్రమోషన్స్ ని మాత్రం ‘అజ్ఝాతవాసి’ థియేటర్స్ నుంచే మొదలెట్టనుంది. పవన్ ని నమ్ముకొంటే ‘ఎమ్మెల్యే’కు మంచి భవిష్యత్ ఉంటుంది. మంచి కలెక్షన్స్ కురిపిస్తాడని భావిస్తున్నారు. మరీ.. అజ్ఝాతవాసి ఎమ్మెల్యేకు ఏ విధంగా ప్లస్ అవుతాడన్నది చూడాలి.